కరోనా వైరస్‌‌కు పారాసిటిమాల్.. వైఎస్ సునీతారెడ్డి ఏమన్నారంటే.. !

ABN , First Publish Date - 2020-03-19T17:17:01+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ పాకడంతో ఇరు రాష్ట్రాల ప్రజలు భయంతో జంకుతున్నారు.

కరోనా వైరస్‌‌కు పారాసిటిమాల్.. వైఎస్ సునీతారెడ్డి ఏమన్నారంటే.. !

హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ పాకడంతో ఇరు రాష్ట్రాల ప్రజలు భయంతో జంకుతున్నారు. అయితే ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో వైద్య నిపుణులు ఇప్పటికే పలు జాగ్రత్తలు చెప్పారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రకటనల రూపంలో.. ఆరోగ్య శాఖా మంత్రులు మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తున్నారు. అయితే.. అసలు కరోనా దరిదాపుల్లోకి రాకుండా ఉంటే ఏం చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కరోనా సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి (బాబాయ్ కుమార్తె) ప్రముఖ వైద్యురాలు సునీతారెడ్డి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.


సునీతారెడ్డి మాటల్లోనే..

కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జబ్బు వచ్చినప్పటికీ ఆ రోగులు 80 శాతం తొందరగానే కోలుకుంటున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ ఉందని తెలిసినప్పుడు వాటి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒళ్లు నొప్పులుంటే నొప్పికి మందులు తీసుకుంటాం.. జ్వరం ఉంటే పారాసిటమాల్.. దగ్గు ఉంటే దగ్గు మందు తీసుకోవచ్చు. వీటన్నింటికంటే ముఖ్యం విశ్రాంతి. కరోనా లక్షణాలున్నప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా క్వారంటైన్ యువర్ సెల్ఫ్.. అంటే మిగిలినవారికి అందుబాటులో ఉండకుండా ఉంటే ఎవరికీ విస్తరించకుండా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ఎవరికీ అందుబాటులో లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలిఅని సునీతారెడ్డి వెల్లడించారు.


14-15 రోజులు ఐసోలేషన్‌లో పెడితే మానసికంగా ఇబ్బంది గురయ్యే అవకాశం ఉందా..!?

ఒక్క రూమ్‌లో ఎవరితో మాట్లాడకుండా ఒక్కరోజు ఉండాలంటేనే చాలా కష్టంగానే ఉంటుంది. 14-15 రోజులు క్వారంటైన్‌లో పెట్టడం కచ్చితంగా అవసరమే. వన్ టూ వన్ కూర్చోవద్దు.. మాట్లాడోద్దు అంతే కానీ.. ఫోన్లలో మాట్లాడొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. మరీముఖ్యంగా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మానసిక ధైర్యం పొందడానికి మెడిటేషన్ చాలా అవసరం. ఎక్సర్‌సైజ్ చేసి ఆరోగ్యంగా ఉండటం అనేది కూడా ముఖ్యమే. ఎంతసేపూ కూర్చోనే ఉంటే బాడీ వీక్ అవుద్ది. హెల్తీగా తినడం కూడా ముఖ్యమే. ఇబ్బందికర పరిస్థితుల్లో కంపార్ట్‌గా ఉండాలి. మరీ ముఖ్యంగా చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో అనేది నేర్చుకుంటే జీవితంలో చాలా హెల్త్ సమస్యల నుంచి బయటపడొచ్చుఅని సునీతారెడ్డి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

Updated Date - 2020-03-19T17:17:01+05:30 IST