కొంపముంచిన వైఎస్ జయంతి..వైసీపీ అగ్రనేతలకు కరోనా?

ABN , First Publish Date - 2020-07-15T23:48:59+05:30 IST

జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలను కరోనా వైరస్ కలవర పెడుతోంది. పలువురికి..

కొంపముంచిన వైఎస్ జయంతి..వైసీపీ అగ్రనేతలకు కరోనా?

విశాఖ: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలను కరోనా వైరస్ కలవర పెడుతోంది. పలువురికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 8న ఆముదాల వలసలో నిర్వహించిన వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యనేతలకు పాజిటివ్ అని తేలడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు  గురవుతున్నారు. 


శ్రీకాకులం జిల్లా అధికార పార్టీ నేతల అత్యుత్సాహం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న కార్యక్రమాలు  మరింత ఇబ్బందులు తెస్తున్నాయి. జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పుతుండగా ఇప్పుడు జిల్లాకు చెందిన కీలక ప్రజా ప్రతినిధులు, నేతలు వారి కుటుంబ సభ్యులే బాధితులుగా మారుతున్నారు. ఆముదాలవలసలో ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకలు భారీగా నిర్వహించడం కార్యక్రమానికి హాజరైన వారిలో  వైరస్ లక్షణాలు వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. 


మొదట గ్రీన్‌గా జోన్‌గా ఉన్న శ్రీకాకుళంలో ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. నాలుగు కేసులతో ప్రారంభమై ప్రస్తుతం వాటి సంఖ్య 2 వేలకు చేరింది. అయితే కరోనా కట్టడికి ప్రజల్లో కొంత చైతన్యం కనిపిస్తున్నప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పేర్లతో భారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు జిల్లాల్లో వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలకు వైసీపీ నేతల వ్యవహారం అడ్డంకిగా మారుతోంది. శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ  నేతలను ఇప్పుడు కొత్త టెన్షన్ వెంటాడుతోంది. వైసీపీ ముఖ్యనేతలు శ్రేణుల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 

Updated Date - 2020-07-15T23:48:59+05:30 IST