ఆ ఇబ్బందుల కంటే..విద్యార్ధుల తల్లిదండ్రుల ఇబ్బందులే పెద్దవి: జగన్

ABN , First Publish Date - 2020-04-28T21:44:09+05:30 IST

జగనన్న విద్యాదీవెన పథకంను సీఎం జగన్‌ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

ఆ ఇబ్బందుల కంటే..విద్యార్ధుల తల్లిదండ్రుల ఇబ్బందులే పెద్దవి: జగన్

అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకంను  సీఎం జగన్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని.. అంతవరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం గుర్తుచేశారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్చి 31 వరకూ ఉన్న బకాయిలు చెల్లిస్తామన్నారు. వచ్చే ఏడాది 2020-21కి సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ నగదు జమచేస్తామని జగన్ పేర్కొన్నారు. కరోనా, ప్రభుత్వ ఇబ్బందుల కంటే..విద్యార్ధుల తల్లిదండ్రుల ఇబ్బందులే పెద్దవన్నారు. ఇప్పటికే కాలేజీలకు ఫీజు కట్టి ఉంటే.. ఆ డబ్బును తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాలేజీలో సదుపాయాలు లేకపోతే 1902 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 

Updated Date - 2020-04-28T21:44:09+05:30 IST