ఎస్‌ఐపై యువకుల దాడి

ABN , First Publish Date - 2020-07-22T08:13:25+05:30 IST

కరోనా సమయంలో బయట తిరగవద్దన్నందుకు ఓ ఎస్‌ఐపై ఇద్దరు యువకులు దాడిచేశారు.

ఎస్‌ఐపై యువకుల దాడి

గుంటూరు (కార్పొరేషన్‌), జూలై 21: కరోనా సమయంలో బయట తిరగవద్దన్నందుకు ఓ ఎస్‌ఐపై ఇద్దరు యువకులు దాడిచేశారు. సేకరించిన వివరాలివి.. పాతగుంటూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఆనంద్‌పేట బారా ఇమామ్‌ పంజా వద్ద మంగళవారం ఎస్‌ఐ అమీర్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. షాపులు మూయించి తిరిగి వెళుతున్న సమయంలో ఆనంద్‌పేటకు చెందిన నజీద్‌, జాకీర్‌ అనే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఎస్‌ఐ అమీర్‌ ఆ వాహనాన్ని ఆపి తాళం తీసుకున్నారు. దీంతో ఆ యువకులు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్‌కు తీసుకురమ్మని చెప్పగా అందుకు నిరాకరించిన ఆ ఇద్దరు ఎస్‌ఐపై దాడి చేశారు. ఎస్‌ఐ, యువకులు ఘర్షణ పడగా, కిందపడిన ఎస్‌ఐకి ఎడమ భుజం జారింది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడిచేసిన యువకులు పరారయ్యారు.  

Updated Date - 2020-07-22T08:13:25+05:30 IST