గొంతు నులిమి.. నేలకేసి కొట్టి..

ABN , First Publish Date - 2020-06-19T10:04:07+05:30 IST

మద్యానికి భార్య డబ్బులివ్వలేదనే కోపంతో ఆరు నెలల కూతురిని చంపాడో కర్కోటక తండ్రి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని అమానిగుడిపాడు ..

గొంతు నులిమి.. నేలకేసి కొట్టి..

6 నెలల చిన్నారిని చంపిన తండ్రి


ఎర్రగొండపాలెం, జూన్‌ 18: మద్యానికి భార్య డబ్బులివ్వలేదనే కోపంతో ఆరు నెలల కూతురిని చంపాడో కర్కోటక తండ్రి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని అమానిగుడిపాడు ఎస్సీకాలనీలో గురువారం జరిగిందీ దారుణం. కాలనీకి చెందిన బాలయేసు, విజయ దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె వయసు ఆరు నెలలు. బాలయేసు మద్యం కోసం గురువారం భార్యను డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆ కోపాన్ని పక్కనే మంచంపై నిద్రిస్తున్న కూతురిపై చూపించాడు. చిన్నారి గొంతును గట్టిగా నులిమి, పైకి ఎత్తి నెలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది.

Updated Date - 2020-06-19T10:04:07+05:30 IST