ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ వీరంగం

ABN , First Publish Date - 2020-11-26T09:05:26+05:30 IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో బుధవారం వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉన్న ఒక వర్గం వారిపై వేటకొడవళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.

ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ వీరంగం

ఓ వర్గంపై వేట కొడవళ్లు, కర్రలతో దాడి 


చిలకలూరిపేట, నవంబరు 25: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో బుధవారం వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉన్న ఒక వర్గం వారిపై వేటకొడవళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గర్భిణులు, రోగులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ దాడిలో 10 మంది గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని కట్టుబడివారిపాలెం గ్రామంలో ఓ స్థలం విషయంలో వైసీపీకి చెందిన ముత్యాల రామారావు, మేరం శ్రీనివాసరావు వర్గాల మధ్య వివాదం ఉంది. ఈ విషయంపై మాటామాటా పెరిగి మంగళవారం ఘర్షణకు దిగారు.


గాయపడినవారు చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేరారు. దీనిపై స్థానిక రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ నేపఽథ్యంలో బుఽధవారం ప్రభుత్వాస్పత్రి వేదికగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మేరం శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న గది రక్తపు మరకలతో నిండిపోయింది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో దాడుల ఘటనపై అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కరరావు పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రిలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-11-26T09:05:26+05:30 IST