-
-
Home » Andhra Pradesh » ycp social media fake news viral video
-
ఆకలి తీర్చింది ఎన్‌ఆర్ఐలు.. ఫేక్ ప్రచారం వైసీపీది
ABN , First Publish Date - 2020-05-19T00:27:18+05:30 IST
ఎవరో సాయం చేస్తే మేమే చేశామని ప్రచారం చేసుకోవడం, దానికి తమ సోషల్ మీడియా బలాన్ని వాడుకోవడం ఇప్పుడు..

అమరావతి: ఎవరో సాయం చేస్తే మేమే చేశామని ప్రచారం చేసుకోవడం, దానికి తమ సోషల్ మీడియా బలాన్ని వాడుకోవడం ఇప్పుడు రాజకీయ పార్టీలకు కామన్‌గా మారిపోయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి, వారి పార్టీ సానుభూతిపరులకు ఇదో టాస్క్ అయిపోయింది. తమ అభిమాన ప్రభుత్వం చేసింది కాకపోయినా.. ఎక్కడైనా ఆకట్టుకునే ఫొటో కనిపించింది అంటే వెంటనే వాటికి తమ ప్రభుత్వ ఘనత అని రైటప్‌లతో సోషల్ మీడియాలో పోస్టులతో వెల్లువెత్తిస్తున్నారు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు ఔరా అని అందరూ ఇప్పుడు ముక్కున వేలు వేసుకునే పని చేసింది.
జాతీయ రహదారి పక్కన ఓ చిన్న పాప తన ముందు పేపర్ ప్లేటులో టిఫిన్ పెట్టుకుని తింటున్న ఫొటోను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసుకుంది. వలస కూలీల కుటుంబాలకు చెందిన పాపని ఫొటో బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్ధమయిపోతోంది. చాలా రోజుల తర్వాత మంచి తిండి తింటున్నానన్న ఆనందమో... ఆ పాపది స్మైలీ ఫేసో కాని చూడటానికి ఆకర్షనీయంగా ఫొటో ఉంది. ఆ ఫొటోలోనే ఆనందం కనిపిస్తోంది. జగనన్న ప్రభుత్వం వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన ఆహారమని జయహో.. జగనన్న అని ప్రచారం చేయడం ప్రారంభించారు. వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలోనే ఈ వీడియో వైరల్ అయిపోయింది. అందరూ తమకు తోచిన రీతిలో ముఖ్యమంత్రికి వీరతాళ్లు వేయడం ప్రారంభించారు. జగనన్న అంటే ఒక ఇది.. ఒక అది అని పొగడటం ప్రారంభించారు.