శ్రీకాకుళం వైసీపీలో సీనియర్ల అలక!
ABN , First Publish Date - 2020-09-02T02:34:21+05:30 IST
ఆ నాయకుడికి ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ..

ఆ నాయకుడికి ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఓ వెలుగు వెలిగారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెడుతూ దూసుకుపోయావారు. కానీ పార్టీ మారాక ఆయన ఫేటే మారిపోయింది. పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. కానీ పదవుల్లో మాత్రం ఆ పార్టీ అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపించింది. ఆ నాయకుడి సేవలను అన్ని రకాలుగా ఉపయోగించుకుని కరివేపాకులా తీసి పారేసింది. ఇంతకీ ఎవరానేత?.ఏంటా కథ?.
శ్రీకాకుళం జిల్లా అధికార వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పదవుల కోసం ఆశగా ఎదురు చూసి విసిగిపోయిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలుగా ఉన్నా తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఉడికిపోతున్నారట. పార్టీ కార్యక్రమాలతో పాటు అధికార కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహిరిస్తున్నారట. ఇళ్లకే పరిమితమవుతూ పార్టీ అధిష్టానంపై నిరసన తెలుపుతున్నారట.