-
-
Home » Andhra Pradesh » YCP sand exploitation Buddha Venkanna
-
వైసీపీ ఇసుక దోపిడీకి ఆకాశమే హద్దు: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2020-12-27T16:10:35+05:30 IST
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. ‘‘తట్టెడు ఇసుక ఇవ్వలేని వాడు.. మూడు ముక్కల రాజధాని కడతా అంటే ఎలా నమ్మాలి ఎంపీ విజయసాయిరెడ్డి అని ప్రశ్నించారు. వైసీపీ ఇసుక దోపిడీకి ఆకాశమే హద్దని మండిపడ్డారు. ఇసుకాసుర జగన్‌రెడ్డి అక్రమ ఇసుక సంపాదన రూ. 25 వేల కోట్లు.. ఇందులో తమరి వాటా ఎంత సాయిరెడ్డి’’ అని బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.