ప్రధాని, హోం మంత్రి సందర్శించాలనడం తగదు

ABN , First Publish Date - 2020-03-12T10:55:43+05:30 IST

అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని ప్రధాని, హోం మంత్రి ఎందుకు సం దర్శించడం లేదని కొంత మంది ఎంపీలు ప్రశ్నిస్తున్నా రు

ప్రధాని, హోం మంత్రి సందర్శించాలనడం తగదు

  • లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు
  • ప్రతిపక్షాల నిరసన

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ‘అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని ప్రధాని, హోం మంత్రి ఎందుకు సం దర్శించడం లేదని కొంత మంది ఎంపీలు ప్రశ్నిస్తున్నా రు. యుద్ధం జరిగేటప్పుడు అక్కడకు వెళ్లి ఆర్మీ చీఫ్‌ ప్రత్యక్షంగా పోరాడరు’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఢిల్లీ అల్లర్లపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు బల్లలు చరిచి ఆయన వ్యాఖ్యలను స్వాగతించారు. ఢిల్లీ అల్లర్లు ఎందుకు జరిగాయి.. అందులోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటిస్తున్న సమయంలోనే ఎందుకు జరిగాయన్నదానిపై దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. 36 గంటల్లో పరిస్థితిని, అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారని, అందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.


ప్లకార్డులు తేవొద్దు.. వెల్‌లోకి రావద్దు

వరుస వాయిదాలు, సభలో జరుగుతున్న పరిణామాలు, ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీల స స్పెన్షన్‌పై అంతకుముందు ఉదయం సభలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్ని పార్టీల నేతల అభిప్రాయాలు కోరారు. రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలోకి ప్లకార్డులు తీసుకురావడానికి అనుమతించవద్దని సూచించారు. విపక్ష సభ్యులు దీనిపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష సభ్యుల కు నిరసన తెలిపే హక్కుంది. కానీ వెల్‌లోకి రావడం సరికాదు. సభ మర్యాదను కాపాడే వి ధంగా నిబంధనలు రూపొందించండి. ఏడుగు రు ఎంపీల సస్పెన్షన్‌కు దారి తీసిన పరిణామాలు బాధాకరం. సస్పెండైన ఎంపీలతో వ్యక్తిగతంగా మాట్లాడాను. వారు కూడా ఇలా జరగాల్సింది కాదని బాధపడ్డారు. కాబట్టి ఆ ఎంపీలను క్షమించండి’ అని సభాపతిని కోరారు.

Updated Date - 2020-03-12T10:55:43+05:30 IST