డీజీపీని కలిసిన వైసీపీ ఎమ్మెల్యేల బృందం

ABN , First Publish Date - 2020-03-19T22:33:48+05:30 IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లి గౌతమ్ సవాంగ్‌ను కలిసారు.

డీజీపీని కలిసిన వైసీపీ ఎమ్మెల్యేల బృందం

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లి గౌతమ్ సవాంగ్‌ను కలిసారు. నిన్న ఎస్ఈసీ రమేష్ కుమార్ పేరుతో సర్క్యులేట్ చేసిన లేఖపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా లేఖను సర్క్యులేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ లేఖ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు. పలువురు మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉందని ఎమ్మెల్యేలు డీజీపీకి తెలిపారు. లేఖతో పాటు జరుగుతున్న పరిణామాలపై కీలక సమాచారాన్ని ఎమ్మెల్యేలు డీజీపీకి అందించారు. కాగా డీజీపీని కలిసిన వారిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, పార్థసారథి, మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-03-19T22:33:48+05:30 IST