-
-
Home » Andhra Pradesh » YCP MLA Protest
-
నెల్లూరు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే నిరసన
ABN , First Publish Date - 2020-12-19T20:04:00+05:30 IST
జీజీహెచ్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్నాకు దిగారు.

నెల్లూరు జిల్లా: జీజీహెచ్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్నాకు దిగారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది పనిచేశారని అన్నారు. వారందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఒక లెక్క.. నెల్లూరు జిల్లా మరోలెక్కా అని ప్రశ్నించారు. మిగిలిన జిల్లాల్లో రూ. 70వేలు చెల్లిస్తుంటే.. నెల్లూరులో మాత్రం రూ. 50 వేలు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. జీతాల కోసం వైద్యులు రోడ్డెక్కుతుంటే ఎమ్మెల్యేగా సిగ్గుతో తల దించుకుంటున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.