-
-
Home » Andhra Pradesh » ycp mla cm jagan guntur ap
-
మీ స్వార్థానికి జగన్ ఆశయం బలైపోతుంది: వైసీపీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-04-08T02:55:09+05:30 IST
ఎక్సైజ్ సిబ్బందిపై వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే రజినీ మండిపడ్డారు.

గుంటూరు: ఎక్సైజ్ సిబ్బందిపై వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే రజినీ మండిపడ్డారు. లంచం డిమాండ్ చేసిన ఆడియో టేపుల్ని వినిపించి మద్యాన్ని కట్టడి చేయాల్సిన మీరే లంచాలు తీసుకుని అమ్మేస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీస్తారా అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ.. మీ స్వార్థానికి సీఎం జగన్ ఆశయం బలైపోతుందని ఆమె హెచ్చరించారు. ఇలాంటి అధికారులకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యే రజినీ అన్నారు.