బాబు, లోకేష్.. హత్యలు, మానభంగాలు చేశారని ఆరోపించగలను: అమర్‌నాథ్

ABN , First Publish Date - 2020-08-20T17:40:49+05:30 IST

విశాఖపట్నం: జూమ్ మీటింగ్‌లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

బాబు, లోకేష్.. హత్యలు, మానభంగాలు చేశారని ఆరోపించగలను: అమర్‌నాథ్

విశాఖపట్నం: జూమ్ మీటింగ్‌లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. విశాఖపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రకటన చేసినప్పటి నుంచి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో విశాఖకు ఏమి చేశారో చెప్పాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం దేశంలో అతి పెద్ద స్కామ్ అని.. అమరావతి పేరుతో అవినీతికి పాల్పడ్డారని అమర్‌నాథ్ ఆరోపించారు. అమరావతి ప్రాంతాల్లో లోకేష్‌తో సహా టీడీపీ నేతలు ఎందుకు ఒడిపోయారో బాబు చెప్పాలన్నారు.


మైసూర్ బోండాలో మైసూర్ ఎలా ఉండదో.. అమరావతిలో అభివృద్ధి కూడా అంతేనన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు చూపించాలన్నారు. తాను కూడా బాబు, లోకేష్ .. హత్యలు, మానభంగాలు చేశారని ఆరోపించగలనని.. కానీ నిరాధారమైన ఆరోపణలు చేయబోమని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ.. ట్విట్టర్, జూమ్ పార్టీగా మారిందన్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు తేడా కేండిడేట్ అని పేర్కొన్నారు. పరిపాలన రాజధానికి భూమి పూజ జరిగినట్లు తనకు తెలియదని.. విశాఖలో స్టేట్ గెస్ట్ గౌస్ కట్టకూడదా? అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-08-20T17:40:49+05:30 IST