విశాఖ: పోలీసులపై వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-12-19T17:52:18+05:30 IST

విశాఖ: నగరంలో వైసీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించారు.

విశాఖ: పోలీసులపై వైసీపీ నేతల దౌర్జన్యం

విశాఖ: నగరంలో వైసీపీ నేతలు దౌర్జన్యం ప్రదర్శించారు. తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త విజయనిర్మల ఆధ్వర్యంలో మూడు రాజధానులు ముద్దంటూ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెలగపూడి, రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడికి యత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడితోపాటు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో వైసీపీ నేతలు సీఐను తోసేశారు. దీంతో ఆయన ఆటోపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. వైసీపీ నేతల వ్యవహారశైలిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరును టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు.

Read more