విశాఖ వైసీపీ నాయకుల్లో కంగారు.. ఎవరి వల్లనో తెలుసా?

ABN , First Publish Date - 2020-09-15T03:22:49+05:30 IST

ఆ నాయకులు అధికార పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో ఆదర్శంగా మెలగాల్సిన వారే ...

విశాఖ వైసీపీ నాయకుల్లో కంగారు.. ఎవరి వల్లనో తెలుసా?

ఆ నాయకులు అధికార పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో ఆదర్శంగా మెలగాల్సిన వారే కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సోషల్ డిస్టెన్స్ మరిచి గుంపులు, గుంపులుగా కనిపించడంపై స్వపక్ష కార్యకర్తలే మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు. వారి తీరు సొంత పార్టీ కేడర్‌నే బేజార్ ఎత్తిస్తోంది. 


విశాఖలో కరోనా కేసులు రోజు రోజుకు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి.  దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సకల చర్యలు తీసుకుంటున్నారు. అయితే కరోనా నియంత్రణకు సాధారణ ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే బాధ్యత గల ప్రజా ప్రతినిధులు మాత్రం అసలు పట్టించుకోవడం లేదట. తాము అధికార పార్టీలో ఉన్నామన్న ధీమానో లేక మరేదో తెలియదు గానీ వీరంతా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో నేతల తీరుపై స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. కరోనా నియంత్రణలో అదర్శంగా ఉండాల్సిన నేతలే నిర్లక్ష్యంగా ఉండటమేంటని మండిపడుతున్నారు. చిత్రమేంటంటే వైసీపీలో చాలా మంది నేతలు కరోనా వైరస్ బారిన పడిన వారే. ఇందులో విజయసాయి రెడ్డి విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సహా పలువురు వైసీపీ  నేతలు ఉన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా కొన్నాళ్లు విశాఖలో పార్టీ కార్యాలయాన్ని కూడా మూసి  వేశారు. 

Updated Date - 2020-09-15T03:22:49+05:30 IST