అనంతపురం జేఎన్టీయూ వీసీకి వైసీపీ నేతల బెదిరింపులు
ABN , First Publish Date - 2020-10-28T03:56:39+05:30 IST
జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జేఎన్టీయూ వీసీ శ్రీనివాసకుమార్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ, జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి చెందిన కాలేజీలకు సంబంధించి జేఎన్టీయూకు..

అనంతపురం: జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జేఎన్టీయూ వీసీ శ్రీనివాసకుమార్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ, జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి చెందిన కాలేజీలకు సంబంధించి జేఎన్టీయూకు కోట్లలో బకాయిపడ్డారు. దీంతో ఈ రెండు కాలేజీలను అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. తట్టుకోలేకపోయిన వైసీపీ నేతలు వీసీ శ్రీనివాసకుమార్‌ను బెదిరించారు. ఇంజినీరింగ్ కాలేజీలో ప్రమాణాలు లేకున్నా కౌన్సెలింగ్‌ను అనుమతించాలని హుకుం జారీ చేశారు. ఈ నేతల బెదిరింపులను వీసీ శ్రీనివాసకుమార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.