నెల్లూరు జిల్లా వైసీపీలో భగ్గుమన్న పాత కక్షలు
ABN , First Publish Date - 2020-09-02T03:12:01+05:30 IST
ఏఎస్ పేట మండలం వైసీపీలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గుడిపాడు మాజీ ఎంపీటీసీ దేవరాల హజరత్తయ్య, అనుచరుడు ప్రభాకర్ రెడ్డిపై ..

నెల్లూరు: ఏఎస్ పేట మండలం వైసీపీలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గుడిపాడు మాజీ ఎంపీటీసీ దేవరాల హజరత్తయ్య, అనుచరుడు ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నాయకుడు తిరుపతి రెడ్డి వర్గీయులు దాడి చేశారు. బైక్‌పై వెళ్తుండగా కర్రలతో కొట్టి ముళ్ల పొదల్లో పడేశారు. హజరత్తయ్య, ప్రభాకర్‌రెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.