ప్రభుత్వకార్యాలయంలో సెటిల్మెంట్లు.. కొట్టుకున్న వైసీపీ వర్గాలు

ABN , First Publish Date - 2020-06-18T23:06:26+05:30 IST

రాప్తాడు నియోజకవర్గం చెన్నేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఘర్షణ జరిగింది. ఎంపీడీవో కార్యాలయం కేంద్రంగా..

ప్రభుత్వకార్యాలయంలో సెటిల్మెంట్లు.. కొట్టుకున్న వైసీపీ వర్గాలు

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం చెన్నేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఘర్షణ జరిగింది. ఎంపీడీవో కార్యాలయం కేంద్రంగా కొద్దిరోజులుగా వైసీపీ నేతలు ప్రైవేటు పంచాయితీలు నిర్వహిస్తున్నారు. ఇలా చెన్నేపల్లి కొత్తపల్లి మండలం ఎర్రోనిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తల గొడవను సెటిల్‌మెంట్ చేయడానికి ఎంపీడీవో ఆఫీసులో సమావేశం అయ్యారు. అయితే ఈ సెటిల్‌మెంట్ చేయడానికి వైసీపీలోని రెండు వర్గాలు వచ్చాయి. రెండు వర్గాలు కూర్చొని భార్యాభర్తల పంచాయితీ తీర్చాలని అనుకున్నారు. అయితే అసలు విషయం పక్కకు పోయింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఎంపీడీవో ఆఫీసులో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులను బెదిరించి కార్యాలయాల్లోనే సెటిల్‌మెంట్ చేస్తూ వైసీపీ నేతలు ఎవరినీ లెక్కచేయడం లేదని కొద్దిరోజులుగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గొడవతో ఇంకోసారి ఈ విషయం స్పష్టమైందని అంటున్నారు

Updated Date - 2020-06-18T23:06:26+05:30 IST