వైసీపీ నేతలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: ఆదివాసీ జేఏసీ కన్వీనర్
ABN , First Publish Date - 2020-03-02T13:40:52+05:30 IST
విశాఖ: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన జేఏసీని నీరుగార్చేందుకు వైసీపీ నేతలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆదివాసీ జేఏసీ కన్వీనర్ రామారావు వెల్లడించారు.

విశాఖ: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన జేఏసీని నీరుగార్చేందుకు వైసీపీ నేతలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆదివాసీ జేఏసీ కన్వీనర్ రామారావు వెల్లడించారు. పాడేరులో గిరిజన జేఏసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామారావు మాట్లాడుతూ.. వైసీపీ నేతల బెదిరింపులకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి బెదిరింపులకు తామ భయపడేది లేదని తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని రామారావు స్పష్టం చేశారు.