రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ నేతలు ఫైర్
ABN , First Publish Date - 2020-06-16T22:45:25+05:30 IST
ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజగా ఆయన తీరును తప్పుపడుతూ తీర్పూగోదావరి జిల్లా నేతలు భగ్గుమన్నారు.

అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజగా ఆయన తీరును తప్పుపడుతూ తీర్పూగోదావరి జిల్లా నేతలు భగ్గుమన్నారు. రఘురామ కృష్ణంరాజుపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారాలనుకుంటే నేరుగా వెళ్లిపోవాలి కానీ, ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రఘురామ కృష్ణంరాజు కోసం బ్యానర్ కట్టే కేడర్ కూడా లేదని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఒక్కసారి పోటీ చేయడానికే మూడు పార్టీలు మారిన చరిత్ర రఘురామ కృష్ణంరాజుది అని మరో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.