వాలంటీర్ కుటుంబ సభ్యులపై వైసీపీ నేత దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-06-25T22:52:07+05:30 IST

వాలంటీర్ కుటుంబ సభ్యులపై వైసీపీ నేత దౌర్జన్యం

వాలంటీర్ కుటుంబ సభ్యులపై వైసీపీ నేత దౌర్జన్యం

ఆనంతపురం: తాడిపత్రి నియోజకవర్గం జూటూరులో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. చెప్పిన మాట వినడం లేదంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన వాలంటీర్ కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసభ్య పదజాలంతో ఫోన్ లో వాలంటీర్ సోదరుడు నాగ సుబ్బారాయుడుని వైసీపీ నేత ఎర్రగుడి వినయ్ కుమార్ రెడ్డి దూషించారు. వైసీపీ నేత బెదిరింపులపై పెద్దపప్పూరు పోలీసులకు నాగ సుబ్బారాయుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ మరో సారి వైసీపీ నేత వినయ్ కుమార్ రెడ్డి తండ్రి రామ్మోహన్ రెడ్డి బెదిరింపులకు దిగారు. వైసీపీ నేత వినయ్ కుమార్ రెడ్డి నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి తో నాగ సుబ్బరాయుడు తండ్రి రాముడు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-25T22:52:07+05:30 IST