ఆదోనిలో రెచ్చిపోయిన వైసీపీ నేత.. డిజిటల్ అసిస్టెంట్‌పై దాడి

ABN , First Publish Date - 2020-09-05T16:55:19+05:30 IST

ఆదోనిలో వైసీపీ నేత కల్లు బోతు సురేష్ రెచ్చిపోయారు. తన పనులు జరగడం లేదంటూ మండగిరి రెండో సచివాలయంలో వీరంగం సృష్టించాడు. అంతటితో

ఆదోనిలో రెచ్చిపోయిన వైసీపీ నేత.. డిజిటల్ అసిస్టెంట్‌పై దాడి

కర్నూలు: ఆదోనిలో వైసీపీ నేత కల్లు బోతు సురేష్ రెచ్చిపోయారు. తన పనులు జరగడం లేదంటూ మండగిరి రెండో సచివాలయంలో వీరంగం సృష్టించాడు. అంతటితో ఆగకుండా డిజిటల్ అసిస్టెంట్ నరేంద్రపై వైసీపీ నేత భౌతికదాడులకు దిగాడు. సచివాలయ ఉద్యోగులను అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడు. భయబ్రాంతులకు గురైన ఉద్యోగులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.


Updated Date - 2020-09-05T16:55:19+05:30 IST