వలంటీరును వేధించిన వైసీపీ నేత అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-09-20T09:02:03+05:30 IST

మహిళా వలంటీరును వేధింపులకు గురిచేసిన వైసీపీ నేతను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం

వలంటీరును వేధించిన వైసీపీ నేత అరెస్ట్‌

పెద్దపంజాణి, సెప్టెంబరు 19: మహిళా వలంటీరును వేధింపులకు గురిచేసిన వైసీపీ నేతను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం వీరప్పల్లె పంచాయతీ కెళవాతి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు యరబల్లి శ్రీనివాసులు అదే గ్రామానికి చెందిన మహిళా వలంటీరును వేధింపులకు గురిచేశారు. లొంగకపోవడంతో దుర్భాషలాడారు. ఆయన చేసిన చాటింగ్‌, ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌లతో పోలీసులకు వలంటీరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం గాలింపు చర్యలు చేపట్టి  శ్రీనివాసులును అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-09-20T09:02:03+05:30 IST