మా విద్యార్థులను ఎలా తప్పిస్తారు?

ABN , First Publish Date - 2020-10-21T08:23:09+05:30 IST

గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో గతనెలలో జరిగిన జనరల్‌ సర్జరీ పరీక్షల్లో ఇద్దరు పీజీ విద్యార్థులు ఫెయిలయ్యారు.

మా విద్యార్థులను ఎలా తప్పిస్తారు?

కళాశాల డీన్‌, చైర్మన్‌పై వైసీపీ నేత ఆగ్రహం 


గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో గతనెలలో జరిగిన జనరల్‌ సర్జరీ పరీక్షల్లో ఇద్దరు పీజీ విద్యార్థులు ఫెయిలయ్యారు. సర్జరీ ప్రొఫెసర్‌ ఉద్దేశపూర్వకంగా తమను తప్పించినట్లు భావించిన సదరు విద్యార్థులు సీఎంకు సన్నిహితంగా ఉండే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతను ఆశ్రయించారు. ఆయన నేరుగా ఆ కళాశాల డీన్‌, చైర్మన్‌కు ఫోన్‌ చేశారు. ‘వారిద్దరూ మా నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు. వారి ని ఎలా తప్పిస్తారు?’ అంటూ ఆగ్రహం వ్య క్తం చేశారు. వర్సిటీ ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి కూర్చొని మరోసారి డీన్‌కు ఫోన్‌ చేయించారు. ‘విద్యార్థులను ఎందుకు తప్పించారో నా ఎదురుగా (నేత ఎదురుకొచ్చి )సమాధానం ఇవ్వాలని’ ఉన్నతాధికారి హుకుం జారీ చేశారు. రాతపూర్వకంగా తెలియజేయాలని డీన్‌ కోరడంతో అధికారి ఫోన్‌ పెట్టేశాడు. ఆ ఇద్దరికీ మరోసారి పరీక్షలు జరిపి ఉత్తీర్ణులు చేయాలని వైద్య కళాశాల యాజమాన్యానికి గట్టి ఆదేశాలు అందాయి. 

Updated Date - 2020-10-21T08:23:09+05:30 IST