అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన పేరుతో వైసీపీ డ్రామా: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-08T22:20:15+05:30 IST

అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన పేరుతో వైసీపీ డ్రామా: చంద్రబాబు

అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన పేరుతో వైసీపీ డ్రామా: చంద్రబాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. విజయవాడలో వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన పేరుతో వైసీపీ నేతలు డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగిన 2 నెలల తర్వాత కంపెనీ ప్రతినిధులపై కేసులు పెట్టడం వెనుక మర్మం అందరికీ తెలిసిందే అన్నారు. కంపెనీని తక్షణమే అక్కడ నుంచి తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్యాస్ లీకేజీకి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి దుర్ఘటనల్లో ఇతర దేశాల్లో ఇచ్చినంత పరిహారం ఇక్కడి బాధితులకు చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితులకు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-07-08T22:20:15+05:30 IST