వైసీపీ విరాళాలు 8.92 కోట్లు

ABN , First Publish Date - 2020-12-20T08:28:42+05:30 IST

వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ విరాళాలు అందాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.8కోట్ల 92 లక్షలు విరాళాలు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సంబంధిత వివరాలను వైసీపీ

వైసీపీ విరాళాలు 8.92 కోట్లు

2.5 కోట్లు విరాళమిచ్చిన శేఖర్‌ రెడ్డి కంపెనీ

విరాళాల వివరాలను ఈసీకి సమర్పించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌


న్యూఢిల్లీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ విరాళాలు అందాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.8కోట్ల 92 లక్షలు విరాళాలు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సంబంధిత వివరాలను వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘానికి అందించారు. అత్యధికంగా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు జె.శేఖర్‌రెడ్డికి చెందిన జేఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.2కోట్ల 50లక్షలు విరాళంగా ఇచ్చింది. హోలిమేరీ విద్యాసంస్థల అధినేత, వైసీపీ నేత ఆరిమెండ వరప్రసాద్‌రెడ్డి, ఆరిమెండ విజయసారధిరెడ్డి దంపతులు రూ.1.2కోట్లు, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శివకుమార్‌రెడ్డి, ఆయన కంపెనీ శివ ఎంటర్‌ప్రైజెస్‌ కలిపి రూ.1.5కోట్లు ఇచ్చారు. టీటీడీ సభ్యుడు జీవీ భాస్కర్‌రావు రూ.50లక్షలు, తిరుపతికి చెందిన టీ ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి రూ.50లక్షలు, చెన్నైకి చెందిన కెన్సెస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.49లక్షలు, హైదరాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీ ఎలక్ట్రికల్‌ సర్వీసెస్‌ కంపెనీ, ఐబీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, బెంగళూరుకు చెందిన యునైటెడ్‌ బెంగళూరు లిమిటెడ్‌ సంస్థ రూ.25 లక్షల చొప్పున అందించాయి. శ్రీ వినాయకా అడ్వర్డైజింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ సంస్థ రూ.15 లక్షలు, ఆర్‌ఎం అసోసియేట్స్‌, హైదరాబాద్‌లోని తిరుమల హాస్పటల్స్‌ రూ.10లక్షలు, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌ రూ.5.8లక్షలు అందించాయి.


పీజీ డెవలపర్స్‌ రూ.5లక్షలు, హైదరాబాద్‌లోని సాయితేజ డ్రగ్స్‌ సంస్థ రూ.5లక్షలు, పనోరమ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.4.15లక్షలతో పాటు శ్రీనివాస్‌రెడ్డి గుర్రాల రూ.10 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన కొమ్మెర వెంకట రెడ్డి రూ.9లక్షలు, చల్లా రాధాకృష్ణరెడ్డి రూ.8లక్షలు, డి.సత్యనారాయణ్‌రెడ్డి రూ.6లక్షలు, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి రూ.5.5 లక్షలు, వీర్లదిన్నె నిరంజన్‌ రూ.6లక్షలు, శరత్‌చంద్రారెడ్డి ఎట్టపు, కృష్ణాజిల్లాకు చెందిన కట్టా భరత్‌ రూ.5లక్షలు, సందాడి కళ్యాణకుమార్‌ రూ.4.5లక్షలు, మిర్యాలగూడకు చెందిన ఎం.జ్యోతిరెడ్డి రూ.4లక్షలు విరాళంగా ఇచ్చారు. కాగా, ఇవి కాకుండా పలువురు వ్యక్తులు, సంస్థలు తక్కువ మొత్తంలో ఆన్‌లైన్‌ ద్వారా ఆ పార్టీకి విరాళంగా అందించారు.

Updated Date - 2020-12-20T08:28:42+05:30 IST