జగన్‌కు.. ఎల్జీ కంపెనీకి ఉన్న లావాదేవీలు ఏంటి?: ఎమ్మెల్యే గణేష్‌కుమార్
ABN , First Publish Date - 2020-05-25T02:09:30+05:30 IST
జగన్‌కు.. ఎల్జీ కంపెనీకి ఉన్న లావాదేవీలు ఏంటి?: ఎమ్మెల్యే గణేష్‌కుమార్

విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ విమర్శలు చేశారు. చంద్రబాబు విశాఖ వస్తే మీకెందుకు ఉలికిపాటు అని ఎమ్మెల్యే గణేష్‌కుమార్ అన్నారు. జగన్‌కు.. ఎల్జీ కంపెనీకి ఉన్న లావాదేవీలు ఏంటి? అని వాసుపల్లి గణేష్‌కుమార్ ప్రశ్నించారు. రంగనాయకమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సీఐడీ కేసా? అని గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ కంపెనీపై పోస్ట్ పెడితే మీకెందుకు ఉలికిపాటు అని, ఎల్జీ కంపెనీపై కేసులు ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రశ్నించారు. చంద్రబాబు వస్తే ఇవన్నీ ప్రశ్నిస్తారని భయం పట్టుకుందని, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై కేసు పెట్టాలని గణేష్‌కుమార్ డిమాండ్ చేశారు.