ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-17T01:52:17+05:30 IST

ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు: చంద్రబాబు

ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో సహా ఇతర కేంద్ర హామీలపై ఆనాడు జగన్ చెప్పిందేంటి ఇప్పుడు చేసేదేంటని చంద్రబాబు ప్రశ్నించారు. మరో వైపు తనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు పోరాడానని చంద్రబాబు తెలిపారు. 


ఏపీ బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో మూడు రాజుధానుల బిల్లును మళ్లీ  తీసుకురావడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. అది తప్పుడు విధానమని ఆయన మండిపడ్డారు. శాసన మండలి ఇప్పటికే సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన బిల్లులను మళ్లీ ఎలా తెస్తారని ప్రశ్నించారు. మండలిలో మళ్లీ గట్టిగా పోరాడతామని, ఈ బిల్లులపై పోరాటంలో తమకు రెండో ఆలోచనే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.


Updated Date - 2020-06-17T01:52:17+05:30 IST