మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి:నారా లోకేష్

ABN , First Publish Date - 2020-08-01T21:57:01+05:30 IST

మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి:నారా లోకేష్

మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి:నారా లోకేష్

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. 79 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుక పెట్టని జగన్ రెడ్డి, మూడు రాజధానులు నిర్మిస్తా అంటూ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నారని లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో మరో మహిళా రైతు గుండె ఆగిందన్నారు. రాజధాని కోసం 60 సెంట్లు భూమి ఇచ్చిన రైతు సామ్రాజ్యం గారు రాజధాని తరలింపు వార్త విని గుండెపోటుతో చనిపోవడం బాధాకరమని లోకేష్ అన్నారు. తుగ్లక్ నిర్ణయాలతో బ‌ల‌వుతున్న రైతుల ఉసురు జ‌గ‌న్‌రెడ్డికి త‌గ‌ల‌క‌మాన‌దని నారా లోకేష్ విమర్శించారు.


Updated Date - 2020-08-01T21:57:01+05:30 IST