కోర్టు తీర్పుతో అయినా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి: శ్రీనివాసరాజు

ABN , First Publish Date - 2020-05-30T00:12:27+05:30 IST

కోర్టు తీర్పుతో అయినా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి: శ్రీనివాసరాజు

కోర్టు తీర్పుతో అయినా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి: శ్రీనివాసరాజు

విజయవాడ: వరుసగా హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బడుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు అన్నారు. లోపాలను సవరించుకోకుండా న్యాయ వ్యవస్థపైనే విమర్శలు చేస్తున్నారని, బాధ్యతగా ఉండాల్సిన మంత్రులు, ఎమ్మెల్యే లు కూడా న్యాయమూర్తులకు రాజకీయాలు ముడి పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూశారని మండిపడ్డారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో అయినా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం రెండు దశాబ్దాలు‌ వెనక్కి వెళ్లిందని శ్రీనివాసరాజు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు మాని.. అందరితో చర్చించాలని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని శ్రీనివాసరాజు అన్నారు.

Updated Date - 2020-05-30T00:12:27+05:30 IST