ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు...
ABN , First Publish Date - 2020-04-05T16:43:10+05:30 IST
ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు ఎలా ఉపయోగించుకుంటున్నారో..

రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా పేదలను ఆదుకోడానికి జగనన్న ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్‌తోపాటు రూ. వెయ్యి ఆర్థిక సాయం అందిస్తున్నసందర్భంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మారంపల్లి 10వవార్డు కాలనీలో వాలంటీర్ల సమక్షంలో తలారీ రాజ్ కుమార్.. కౌన్సిలర్ అభ్యర్థి సమక్షంలో ఇంటింటికి వెయ్యి పంపిణీ చేయడం జరిగింది. విన్నారా... ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు ఎలా ఉపయోగించుకుంటున్నారో..
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా.. వైసీపీ అభ్యర్థులు మాత్రం ఇలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పైగా ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని స్వయంగా లబ్దిదారులకు అందజేస్తున్నారు. సర్వం లాక్ డౌన్ అయినా ప్రస్తుత పరిస్థితిలో తెల్ల రేషన్ కార్డు దారులకు ఏపి ప్రభుత్వం రూ. వెయ్యి చొప్పున పంపిణి చేస్తోంది. అయితే అధికారపార్టీ నేతలు ఈ సాయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పడుతున్న వైసీపీ అభ్యర్థులు వారి చేతుల మీదుగానే కొన్నిచోట్ల నగదు పంపిణీ చేస్తున్నారు. సొంతంగా డబ్బులు ఇచ్చినట్లుగా ఫీలవుతున్నారు.