మాచర్ల ఘటనపై స్పందించిన వైసీపీ మంత్రి

ABN , First Publish Date - 2020-03-13T00:59:15+05:30 IST

టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

మాచర్ల ఘటనపై స్పందించిన వైసీపీ మంత్రి

విశాఖ: టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని బొత్స అన్నారు. చంద్రబాబు మాటలు చూస్తే ఈ విషయం అర్థమవుతోందన్నారు. రాజ్యాంగబద్ధ పాలన, వ్యవస్థలో మార్పుకోసం ప్రయత్నిస్తున్నామని, మేం అడ్డుకుంటే వేలాది నామినేషన్లు ఎలా దాఖలయ్యాయి? అని బొత్స ప్రశ్నించారు. గొడవలు సృష్టించి ఏదో జరిగిపోతుందని అంటున్నారని బొత్స విమర్శించారు. మాచర్లలో బోండా ఉమ, బుద్దా వెంకన్న వికలాంగుడిని గుద్దేసి వెళ్తే ఎవరైనా ఊరుకుంటారా? అని బొత్స అన్నారు. చంద్రబాబు బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూస్తున్నారని బొత్స ఆరోపించారు.

Updated Date - 2020-03-13T00:59:15+05:30 IST