బీజేపీతో అంటకాగుతున్న వైసీపీ: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-02-08T21:40:05+05:30 IST

దేశంలో బీజేపీ మత విద్వేషాలు రాజేస్తోందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ అన్నారు. అలాంటి బీజేపీతో వైసీపీ అంటకాగుతోందని ఆరోపించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

బీజేపీతో అంటకాగుతున్న వైసీపీ: శైలజానాథ్

నెల్లూరు: దేశంలో బీజేపీ మత విద్వేషాలు రాజేస్తోందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ అన్నారు. అలాంటి బీజేపీతో వైసీపీ అంటకాగుతోందని ఆరోపించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్ఆర్సీ బిల్లుకి ఢిల్లీలో మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ విమర్శించారు. సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 25 మంది ఎంపీలిస్తే హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్నారని, ఇప్పుడు ఎవరి మెడలు వంచాలని అన్నారు. పార్లమెంట్‌లో పునర్‌వ్యవస్థీకరణ బిల్లు కోసం పట్టుబట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-02-08T21:40:05+05:30 IST