ప్రజల జీవితాలతో చెలగాటం

ABN , First Publish Date - 2020-03-02T09:14:53+05:30 IST

ప్రజల జీవితాలతో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా గూడూరులో ఆదివారం పౌరసత్వ సవరణ చట్టానికి...

ప్రజల జీవితాలతో చెలగాటం

  • బీజేపీ, వైసీపీపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల ధ్వజం
  • ఎన్‌పీఆర్‌లో వివరాలు చెప్పొద్దు: గఫూర్‌


గూడూరు, మార్చి 1: ప్రజల జీవితాలతో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా గూడూరులో ఆదివారం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి గూడూరు జేఏసీ ఈ సభను నిర్వహించింది. అంతకు మునుపు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది.


కోట్ల మాట్లాడుతూ  పౌరసత్వ చట్టంపై ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడడం ముఖ్యమంత్రి జగన్‌కు తగదన్నారు. ఎన్‌ఆర్‌సీని తాను వ్యతిరేకిస్తున్నానని, టీడీపీ తరఫున ముస్లింలకు అండగా నిలుస్తామని అన్నారు.  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ... ఎన్‌పీఆర్‌ పేరిట ఇంటింటికీ వచ్చి వివరాలు అడిగితే చెప్పకుండా వెనక్కు పంపాలని ప్రజలకు సూచించారు.

Updated Date - 2020-03-02T09:14:53+05:30 IST