వైసీపీ ర్యాలీలో అధికారులు, సచివాలయ ఉద్యోగులు
ABN , First Publish Date - 2020-02-08T10:43:39+05:30 IST
విశాఖ రాజధానికి మద్దతుగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో వైసీపీ ఆ ధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

శృంగవరపుకోట ఫిబ్రవరి 7: విశాఖ రాజధానికి మద్దతుగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో వైసీపీ ఆ ధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. హాజరైన వారిలో ఎక్కువ మంది మండల పరిషత్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లే ఉన్నారు. మండల పరిషత్ పరిపాలన అధికారి రమాదేవి ముందుండి నడిపించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకే హాజరైనట్టు అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. కాగా ఓ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.