యువకుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి...
ABN , First Publish Date - 2020-08-20T21:03:13+05:30 IST
కడప జిల్లా కాకినాయన మండలం, నరసాపురంలో దారుణం జరిగింది.

కడప జిల్లా: కాకినాయన మండలం, నరసాపురంలో దారుణం జరిగింది. గ్రామ మహిళ వాలంటీర్ భర్త, వైసీపీ కార్యకర్తలు గుర్రప్ప అనే యువకుడిపై దాడి చేశారు. దాడిని అవమానంగా భావించిన గుర్రప్ప కత్తితో పొడుచుకున్నాడు. తీవ్ర గాయాలైన గుర్రప్పను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
గుర్రప్ప తండ్రి అనారోగ్యంతో ఉండడంతో గ్రామ వాలంటీర్ భర్త అతనికి ఫోన్ చేశాడు. ‘మీ నాన్నకు కరోనా వచ్చిందని’ పదే పదే వేధించాడు. దీంతో వాలంటీర్ భర్తను గుర్రప్ప నిలదీశాడు. ఈ క్రమంలో వారు గుర్రప్పపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడితోనే గుర్పప్ప చనిపోయాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.