గ్రామ స్వరాజ్యమంటే అదేనా..?: యనమల

ABN , First Publish Date - 2020-08-16T18:09:21+05:30 IST

గ్రామ స్వరాజ్యమంటే, వైసీపీ ఆర్థిక స్వరాజ్యం కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

గ్రామ స్వరాజ్యమంటే అదేనా..?: యనమల

అమరావతి: గ్రామ స్వరాజ్యమంటే, వైసీపీ ఆర్థిక స్వరాజ్యం కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ.. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం గ్రామ స్వరాజ్యమా?. తప్పుడు కేసులు పెట్టి, నామినేషన్లు విత్ డ్రా చేయించడమా గ్రామస్వరాజ్యం?’’ అని ప్రశ్నించారు. రూ. 8 వేల కోట్ల కరోనా నిధులను దారి మళ్లించడమే నా గ్రామ స్వరాజ్యమన్నారు. గ్రామీణాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చులో మూడోవంతు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదన్నారు. 

Updated Date - 2020-08-16T18:09:21+05:30 IST