అవినీతి బారి నుంచి ఏపీ ప్రజలను కేంద్రం కాపాడాలి: యనమల
ABN , First Publish Date - 2020-10-29T00:52:43+05:30 IST
అవినీతి బారి నుంచి ఏపీ ప్రజలను కేంద్రం కాపాడాలి: యనమల

అమరావతి: అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థిక నిందితులపై సీబీఐ, ఈడీ చర్యలు తీసుకునేలా కేంద్రం చూడాలని పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలో రూ.43 వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆప్తాబ్ ఆలం గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. జగన్ పాలనలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి బారి నుంచి ఏపీ ప్రజలను కేంద్రం కాపాడాలన్నారు.