సీఎం వైఎస్ జగన్‌ మౌనం వీడాలి : యనమల

ABN , First Publish Date - 2020-10-04T17:58:03+05:30 IST

కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం తక్షణమే స్పందించాలని

సీఎం వైఎస్ జగన్‌ మౌనం వీడాలి : యనమల

అమరావతి : కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం తక్షణమే స్పందించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలన్నారు. బినామీ లావాదేవీలపై త్వరలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని.. సెజ్‌ కొనుగోళ్ల బినామీ లావాదేవీలపై సీఎం జగన్‌ మౌనం వీడి స్పందించాలని యనమల డిమాండ్ చేశారు.


ఎకరానికి రూ.10 లక్షల చొప్పున రైతులకు అదనపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుతో జాలర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని.. జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుకలకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. హేచరీస్‌పై ఆధారపడిన కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి సూచించారు.

Updated Date - 2020-10-04T17:58:03+05:30 IST