ప్రభుత్వం మొండిగా వెళ్తే.. సేమ్ సీన్ రిపీట్ అవుద్ది: యనమల

ABN , First Publish Date - 2020-03-02T17:59:24+05:30 IST

అమరావతి: గవర్నర్‌ ప్రసంగంలో సెలెక్ట్‌ కమిటీకి పంపిన బిల్లుల ప్రస్తావన ఉండొద్దని టీడీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ప్రభుత్వం మొండిగా వెళ్తే.. సేమ్ సీన్ రిపీట్ అవుద్ది: యనమల

అమరావతి: గవర్నర్‌ ప్రసంగంలో సెలెక్ట్‌ కమిటీకి పంపిన బిల్లుల ప్రస్తావన ఉండొద్దని టీడీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని గవర్నర్‌ పరిశీలించాలన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఆ అంశాలు ఉంటే .. శాసనమండలిలో సవరణలను ప్రతిపాదించేందుకు వెనకాడబోమన్నారు. తమ హక్కులను ఎవరూ అడ్డుకోలేరని యనమల స్పష్టం చేశారు. సెలెక్ట్‌ కమిటీకి బిల్లులు వెళ్లకుండా ప్రభుత్వమే అడ్డుకుంటోందన్నారు.


సెలెక్ట్‌ కమిటీకి బిల్లులు వెళ్లి ఉంటే ప్రజాభిప్రాయానికి అవకాశం ఉండేదన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే  ప్రజలు తగిన బుద్ధి చెబుతారని యనమల పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్తే మండలిలో సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని.. పథకాలన్నీ రద్దు చేసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేయొద్దన్నారు. ప్రపంచ నియంతల మనస్తత్వం జగన్‌లో కనబడుతోందని యనమల స్పష్టం చేశారు.


Updated Date - 2020-03-02T17:59:24+05:30 IST