కాకినాడ సెజ్‌పై జగన్ కన్నేయడం ఇవాళ్టిది కాదు..: యనమల
ABN , First Publish Date - 2020-10-01T17:16:03+05:30 IST
కాకినాడ సెజ్‌పై జగన్ కన్నేయడం ఇవాళ్టిది కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి: కాకినాడ సెజ్‌పై జగన్ కన్నేయడం ఇవాళ్టిది కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్మోహన్ రెడ్డి 14 ఏళ్ల కల అని అన్నారు. తండ్రి వైఎస్ హయాంలో టీడీపీ అడ్డుకుందనే కక్షకట్టారని, సీబీఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా..భూములను ఆక్రమిస్తున్నారని యనమల ఆరోపించారు.
ఎంపీ విజయసాయిరెడ్డికి బినామీ ఆయన అల్లుడు రోహిత్‌రెడ్డేనని యనమల విమర్శించారు. రూ.5 వేల కోట్ల భూముల్ని బినామీల పేరుతో కొట్టేస్తున్నారని, కాకినాడ సెజ్ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లని..అందులో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.