చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై యనమల మండిపాటు
ABN , First Publish Date - 2020-09-02T03:16:33+05:30 IST
చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అనుమానాస్పద మరణాలపై ...

అమరావతి: చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు చేయాలని కోరడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. దోషులను కఠినంగా శిక్షించాలని లేఖ రాయడం నేరమా..? అని క్వశ్చన్ చేశారు. సాక్ష్యాలివ్వండి, విచారిస్తామని.. పోలీసులు అనడం విడ్డూరమన్నారు. రాష్రంలో వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాయడం దారుణమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు బండకాడపల్లి దళితవాడలో అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఓం ప్రతాప్ మృతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యలకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు. 91 సీఆర్‌పీసీ కింద జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతి విషయంలో స్థానిక వైసీపీ మంత్రుల హస్తం ఉందన్న ప్రతిపక్ష నేత, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే వారం రోజుల లోపల తమకు అందించాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.