శానిటరీ నాప్కిన్లపై వర్కింగ్‌ కమిటీ

ABN , First Publish Date - 2020-10-27T08:37:06+05:30 IST

శానిటరీ నాప్కిన్లపై అవగాహనకు వర్కింగ్‌ కమిటీని ఏర్పాటుచేస్తూ మహిళాశిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

శానిటరీ నాప్కిన్లపై వర్కింగ్‌ కమిటీ

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): శానిటరీ నాప్కిన్లపై అవగాహనకు వర్కింగ్‌ కమిటీని ఏర్పాటుచేస్తూ మహిళాశిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్‌ మిషన్‌ మార్గదర్శకాలు-2015 మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పలు శాఖలు ఈ కార్యక్రమాలను చేపడతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏపీ మానవవనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ(ఏపీహెచ్‌ఆర్‌డీ) యునిసెఫ్‌ సహకారంతో ప్రభుత్వంలోని పలు శాఖలకు శిక్షణ అందిస్తోంది. మహిళా శిశు సంక్షేమశాఖ వైద్య, పాఠశాల విద్య, ఇతర శాఖలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏపీహెచ్‌ఆర్‌డీ సూచనల మేరకు తాజాగా ప్రభుత్వం వివిధ శాఖలతో కలిసి వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.    

Updated Date - 2020-10-27T08:37:06+05:30 IST