అనర్హులను ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చారంటూ మహిళల ఆందోళన

ABN , First Publish Date - 2020-06-19T01:03:03+05:30 IST

అనర్హులను ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చారంటూ మహిళల ఆందోళన

అనర్హులను ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చారంటూ మహిళల ఆందోళన

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామ పంచాయతీ ముందు మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. అధికారులు డబ్బులు తీసుకుని అనర్హులను ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-06-19T01:03:03+05:30 IST