తల్లీ, కూతుళ్ల మృతి కేసులో భర్త, అత్తమామల అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-01T17:19:42+05:30 IST

జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న తల్లీ, కూతుళ్ల మృతి కేసులో మృతురాలి భర్త, అత్తమాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం వివాహిత మనోజ్ఞ తన తొమ్మిది నెలల కూతురు తులసితో సహా ఐదంతస్థుల అపార్ట్‌మెంట్ నుంచి దూకి

తల్లీ, కూతుళ్ల మృతి కేసులో భర్త, అత్తమామల అరెస్ట్

గుంటూరు: జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న తల్లీ, కూతుళ్ల మృతి కేసులో మృతురాలి భర్త, అత్తమాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం వివాహిత మనోజ్ఞ తన తొమ్మిది నెలల కూతురు తులసితో సహా ఐదంతస్థుల అపార్ట్‌మెంట్ నుంచి దూకి చనిపోయింది. అయితే తమ కూతురు, మనవరాలిని ఆమె భర్త, అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మ‌ృతిగా కేసు నమోదు చేసుకున్న పట్టాభిపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నేడు మృతురాలు మనోజ్ఞ భర్త నర్రా కళ్యాణ్, అత్త కామేశ్వరి, మామ శ్రీమన్నారాయణలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-09-01T17:19:42+05:30 IST