అనంతపురం: ఆజాద్‌నగర్‌లో యువతి కిడ్నాప్
ABN , First Publish Date - 2020-11-03T16:24:35+05:30 IST
అనంతపురం: అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. కారులో వచ్చి జ్యోతి అనే యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు.
అనంతపురం: అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. కారులో వచ్చి జ్యోతి అనే యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. జ్యోతి తల్లిదండ్రులు ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతికి ఇటీవలే భగీరథ్ అనే కానిస్టేబుల్‌తో నిశ్చితార్థం జరిగింది. కాగా.. భగీరథ్‌కు అప్పటికే పెళ్లైందని తెలిసి జ్యోతి తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేశారు. కానిస్టేబుల్ భగీరథే తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటాడని జ్యోతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.