పెళ్లిపేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

ABN , First Publish Date - 2020-10-22T01:13:19+05:30 IST

మనం ఇప్పటివరకు అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిల కథలను విన్నాం. అంతేనా.. పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు ఆందోళన చేసిన అభాగ్యుల గాథలను

పెళ్లిపేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

గుంటూరు: మనం ఇప్పటివరకు అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిల కథలను విన్నాం. అంతేనా.. పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్తల ఇంటి ముందు ఆందోళన చేసిన అభాగ్యుల గాథలను కూడా విన్నాం. ఇప్పటివరకు మహిళలు బాధితులుగా ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఇక్కడ అబ్బాయి బాధితుల జాబితాలో చేరాడు. అసలు విషయం ఏమిటంటే.. పెళ్లిపేరుతో యువకుడిని ఓ యువతి మోసం చేసింది. అమెరికాలో ఉంటున్న తెనాలి యువకుడికి ఆమె గాలం వేసింది. మ్యాట్రిమోనిలో ‘‘మైనేని సముద్ర’’ పేరుతో యువతి పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్త పెళ్లిదాక వెళ్లింది. ఇంకేముందు పెళ్లిపీటల మీద కూర్చోవాలని యువకుడు ముచ్చటపడ్డాడు.


ఇద్దరు పెళ్లికి ముహూర్తాన్ని కూడా ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి పెళ్లి హైరానా మొదలైంది. పెళ్లి ఖర్చుల కోసం యువతి, యువకుడి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. పెళ్లి షాపింగ్‌ కోసం రూ.7.20 లక్షలు తన అకౌంట్‌లో  యువతి వేయించుకుంది. పెళ్లి మోజులో పడ్డ అబ్బాయి.. ఆగమేఘాలమీద ఇండియాకు వచ్చాడు. ఆ వెంటనే పెళ్లి చేసుకునేందుకు యువతి ఊరికి వెళ్లాడు. ఇంకేముందు యువకుడిని మోసం చేసి ఆమె పరారయింది. దీంతో ఆ యువకుడు ఉసూరుమంటు పోలీసులను ఆశ్రయించాడు. 

Updated Date - 2020-10-22T01:13:19+05:30 IST