కర్నూలులో యువతి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-02-05T21:03:06+05:30 IST
కర్నూలు జిల్లా పాములపాడు మండలానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

కర్నూలు జిల్లా పాములపాడు మండలానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. రుద్రవరం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ స్థలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. గ్రామ సచివాలయ నిర్మాణానికి ఈ స్థలం కావాలని చెప్తున్నారని ఆమె వెల్లడించింది. దీనికోసం తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న స్థలాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది. తన గోడు వినే నాధుడు లేకపోవడంతో చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన స్థానికులు బలవంతంగా ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.