పశ్చిమగోదావరిలో చేతబడి కలకలం

ABN , First Publish Date - 2020-07-20T01:04:30+05:30 IST

పశ్చిమగోదావరిలో చేతబడి కలకలం

పశ్చిమగోదావరిలో చేతబడి కలకలం

పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెంలో చేతబడి కలకలం సృష్టించింది. వారం రోజుల నుంచి గ్రామంలోని ఒక ఇంటిలో రాత్రి వేళల్లో పెద్ద పెద్ద శబ్దాలతో మంత్రాలు చదవడం, పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురిని పట్టుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. గత సంవత్సరం 16 ఏళ్ళ బాలిక, 18 ఏళ్ల యువకుడు చేతబడి కారణంగా మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పూల మాలలు, పుర్రె, పసుపు, కుంకుమ, తదితర పూజా సామగ్రి ఉండడంతో భయభ్రాంతులకు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చిన ఒక మహిళ అర్దరాత్రి నగ్నంగా క్షుద్రపూజలు చేస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆగ్రహంతో మహిళను గ్రామస్తులు చితకబాదారు.

Updated Date - 2020-07-20T01:04:30+05:30 IST